Share News

‘అమరావతి అగ్గి’ ఘటనలో రిమాండ్‌కు సెక్యూరిటీ గార్డు

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:38 AM

రాజధాని అమరావతిలో ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి.. నిందితుడు సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

‘అమరావతి అగ్గి’ ఘటనలో రిమాండ్‌కు సెక్యూరిటీ గార్డు

  • అతనే నిప్పు పెట్టినట్టు సిట్‌ నిర్ధారణ ఎస్సీ జిందాల్‌

తుళ్లూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి.. నిందితుడు సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శనివారం తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. ‘‘మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు చెందిన పైపులు, ఇతర సామగ్రికి జరిగిన అగ్నిప్రమాదానికి సెక్యూరిటీ గార్డే కారణమని కేసు దరాప్తు చేసిన సిట్‌ బృందం నిర్ధారించింది. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన తిప్పగుడిసె రాము మేఘా ఇంజనీరింగ్‌ సంస్థలో ఏడాది కాలంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రుద్ర సెక్యూరిటీ ఏజెన్సీలో రిజిస్టర్‌ అయిన రాము ప్రతి రోజు స్టాక్‌ పాయింట్‌ ఫొటోలు ఏజెన్సీ వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయాలి. అగ్ని ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10.20 గంటలకు అంతా బాగుందని ఒక ఫొటో రాము పంపించాడు. ఆ తర్వాత 10.35 గంటలకు వాట్సాప్‌లో రెండో ఫొటో పెట్టాడు. మొదటి ఫొటోను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ ఫొటోలో నారింజ రంగు కనిపించింది. అవి మంటలుగా నిర్ధారించుకుని సెక్యురిటీ గార్డును విచారించగా అత ను నేరం చేసిన ట్టు ఒప్పుకొన్నాడు. దీంతో నిందితుడు రాముని శనివారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం.’’ అని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. కేసును చేధించిన సిట్‌లోని పోలీసులకు ప్రశంసా పత్రాలను అందించారు.

Updated Date - Mar 29 , 2026 | 05:40 AM