రెండో విడత ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాపులు: కొండపల్లి
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:17 AM
‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధనలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెండో విడత ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాపులను ఈనెల 22 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధనలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెండో విడత ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాపులను ఈనెల 22 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. 22న తిరుపతి, 24న నెల్లూరు, 25న బాపట్ల, 26న గుంటూరు, 29న అనంతపురం, 30న సత్యసాయి జిల్లాల్లో ఈ వర్క్‌షాపులు ఉంటాయన్నారు.