సాగర గర్భంలో మువ్వన్నెల జెండా
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:39 AM
నగరంలో స్కూబా డైవర్లు సముద్రగర్భంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు.
సాగర్‌నగర్ (విశాఖపట్నం), జనవరి 26(ఆంధ్రజ్యోతి): నగరంలో స్కూబా డైవర్లు సముద్రగర్భంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. రుషికొండ బీచ్‌లో లైవ్ ఇన్ అడ్వంచర్స్ వ్యవస్థాపకుడు బలరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఐదుగురు స్కూబా డైవర్లు, రుషికొండ ఐటీ హబ్ జంక్షన్ సమీపాన ఉన్న సముద్ర గర్భంలో డైవ్ అడ్డా సీఈఓ భద్రం రామిశెట్టి ఆధ్వర్యంలో ఐదుగురు స్కూబా డైవర్ల బృందం 77 అడుగుల లోతులో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జెండాకు వందనం చేశారు.