Share News

మున్సిపల్‌ హెల్త్‌ అధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:41 PM

పట్టణంలోని మున్సిపల్‌ హెల్త్‌ అధికారి సందీ్‌పకుమార్‌, ఆయన కుటుంబ సభ్యులపై పోలీ సులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మున్సిపల్‌ హెల్త్‌ అధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఆదోని, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మున్సిపల్‌ హెల్త్‌ అధికారి సందీ్‌పకుమార్‌, ఆయన కుటుంబ సభ్యులపై పోలీ సులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆస్తి వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను త్రీటౌన్‌ సీఐ రామలింగమయ్య శుక్రవారం మీడి యాకు వెల్లడించారు. ఆర్ట్స్‌ కళాశాల వెనుక భాగం లో హెల్త్‌ అధికారి సందీ్‌పకుమార్‌కు చెందిన సొంత ఇల్లు ఉంది. గడిచిన రెండేళ్ల క్రితం ఈ ఇంటిని సందీ్‌పకుమార్‌ తండ్రి రాంపుల్లయ్య నుంచి సిద్దు అనే వ్యక్తి రూ.1.20 కోట్లకు కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం సిద్దు రూ.కోటి చెల్లించి అప్పటి నుంచి అదే ఇంట్లో నివాసముంటున్నాడు. మిగిలిన రూ.20 లక్షలను వడ్డీతో సహా త్వరలోనే చెల్లిస్తామని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే గురువారం సందీ్‌పకుమార్‌ భార్య, తల్లి , మరికొందరు అనుచరులతో కలిసి సిద్దు ఉంటున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఇంటి కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యా దు ఆధారంగా మున్సిపల్‌ హెల్త్‌ అధికారి సందీప్‌ కుమార్‌, ఆయన భార్య, తల్లితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 17 , 2026 | 11:41 PM