Water Resources Department: స్క్రీనింగ్ కమిటీ పదవీ కాలం రెండేళ్లు పెంపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:39 AM
జల వనరుల శాఖలో మొదటి శ్రేణి అధికారుల బదిలీలపై సమీక్ష చేసే స్క్రీనింగ్ కమిటీ పదవీ కాలాన్ని ఈ నెల 19 నుంచి రెండేళ్లపాటు...
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో మొదటి శ్రేణి అధికారుల బదిలీలపై సమీక్ష చేసే స్క్రీనింగ్ కమిటీ పదవీ కాలాన్ని ఈ నెల 19 నుంచి రెండేళ్లపాటు పొడిగిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ స్ర్కీనింగ్ కమిటీలో ఈఎన్‌సీ (అడ్మినిస్ట్రేషన్), భూగర్భ జల విభాగం డైరెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి/అదనపు కార్యదర్శి (జల వనరుల శాఖ) సభ్యులుగా ఉంటారు.