నెలలోపు ఎస్‌ఎంసీని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 05:51 AM
విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపే ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది.
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపే ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. కమిటీలపై కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కమిటీల్లో అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు, వెనకబడిన తరగతుల ప్రతినిధులు ఉండాలని స్పష్టం చేసింది. కమిటీలో 75శాతం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులే ఉండాలని స్పష్టంచేసింది. 50 శాతం మంది మహిళలు ఉండాలని స్పష్టం చేసింది.