Share News

కాల్వలోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:05 AM

ఎన్టీఆర్‌ జిల్లాలోని తారకరామా కాల్వలో స్కూలు బస్సు బోల్తా పడింది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం-కవులూరు మధ్యలో ఇబ్రహీంపట్నానికి చెందిన..

కాల్వలోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా

జి.కొండూరు, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లాలోని తారకరామా కాల్వలో స్కూలు బస్సు బోల్తా పడింది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం-కవులూరు మధ్యలో ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీచైతన్య స్కూల్‌ బస్సు శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. కాల్వలో నీరు నిండుగా లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమీపంలో ఉన్న రైతులు, కూలీలు కాల్వలో దిగి విద్యార్థులను కాపాడారు.

Updated Date - Aug 23 , 2026 | 05:06 AM