సీమలో చెదురుమదురు వర్షాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:29 AM
శ్రీలంక, తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనద్రోణి ఆదివారం ఉత్తర కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది.
విశాఖపట్నం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీలంక, తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనద్రోణి ఆదివారం ఉత్తర కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వీస్తున్న తేమగాలుల కారణంగా తమిళనాడు, కర్ణాటక, వీటికి ఆనుకొని ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఉత్తరకోస్తాలో పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం పొగమంచు కురిసింది. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గి పగటి పూట ఎండ పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.