ఎస్సీ ఉప వర్గీకరణపై హైకోర్టులో పిల్
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:28 AM
ఎస్సీ ఉప వర్గీకరణలో అభివృద్ధి చెందిన మాలలను వెనుకబడిన ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ తదితర సామాజిక వర్గాల జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం ....
అభివృద్ధి చెందిన మాలల అంశంపై అభ్యంతరం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ ఉప వర్గీకరణలో అభివృద్ధి చెందిన మాలలను వెనుకబడిన ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ తదితర సామాజిక వర్గాల జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, ఆశాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ వాజ్యాన్ని గుంటూరు జి ల్లా, దుగ్గిరాల మండలం, చిలువూరుకు చెందిన సి.నాగరాజు దాఖలు చేశారు.