Share News

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం చేస్తే సహించం: మంత్రి డోలా

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:49 AM

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అధికారులను హెచ్చరించారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం చేస్తే సహించం: మంత్రి డోలా

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అధికారులను హెచ్చరించారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై చర్చించారు. ఇప్పటి వరకు ఎస్సీ కాంపోనెంట్‌ నిధులు ఎంత మేర ఖర్చు చేశారో శాఖల వారీగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్‌కి రూ.20,643 కోట్లు కేటాయించాం. ఆ నిఽధుల్ని జనవరి లోపు 100 శాతం ఖర్చు చేయాల్సిందే. సబ్‌ప్లాన్‌ నిధుల్లో ప్రతి ఒక్క రూపాయి ఎస్సీలకే వినియోగించాలి’ అని అన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి

రాష్ట్రంలో ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి డోలా తెలిపారు. గురువారం సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ’సమర్ధవంతంగా పని చేసే సంరక్షణ ఆర్థిక వ్యవస్థను రూపొందించడం’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, ఆకలి లేని స్థితి, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శాంతి, న్యాయం, బలమైన సంస్థలు, లక్ష్యాల సాధన కోసం భాగస్వామ్యం అనే అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రి స్వామి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 04:49 AM