ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలతో కొండపల్లి చర్చలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:42 AM
పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్ వద్ద ధర్నా చేస్తున్నారు.
ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ
అమరావతి, జనవరి 23((ఆంధ్రజ్యోతి)): పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సచివాలయంలో చర్చలు జరిపారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్‌బాబు, కార్యదర్శి ఈరా రాజశేఖర్, నాయకులు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జేఏసీ నాయకులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. న్యాయం చేస్తామని పవన్, కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే తిరిగి ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.