Share News

ఇన్సెంటివ్స్‌ బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:37 AM

రాష్ట్రంలోని దళి త, గిరిజన పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.700 కోట్ల రాయితీ బకాయిలను వెంటనే ...

ఇన్సెంటివ్స్‌ బకాయిలు చెల్లించాలి

  • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల డిమాండ్‌

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళి త, గిరిజన పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.700 కోట్ల రాయితీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేశారు. ఇన్సెంటివ్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరసన కార్యక్రమాలను మళ్లీ ముమ్మరం చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్స్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడ్పుగంటి అనార్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్పీఐ, ఆప్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.

Updated Date - Feb 08 , 2026 | 04:38 AM