ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:57 AM
ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు.
ఎస్సీ గురుకుల ఇంటర్ విద్యార్థులకు మంత్రి డోలా సూచన
జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన 161 మందికి అభినందనలు
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గురువారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యాలయంలో అంబేడ్కర్ గురుకులాల ఇంటర్ విద్యార్థులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేలా మంత్రి ధైర్యం నింపారు. అందరూ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించారంటూ అభినందించారు. గతేడాది ఐఐటీ, నీట్‌లో సీట్లు సాధించిన 57 మంది విద్యార్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించామన్నారు. కార్యక్రమంలో గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.