ఎస్సీ వర్గీకరణ వల్లే పదోన్నతులు: మంద కృష్ణ మాదిగ
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:09 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు...
ఇంటర్నెట్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మార్కెటింగ్ కమిషనరేట్‌లో డైరెక్టర్ శ్రీనివాసరావును కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం వలన అప్పట్లో చాలామందికి ప్రమోషన్లు లభించాయని చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ నిలిచిపోగా చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో అనేకసార్లు మాజీ సీఎం జగన్‌ని కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని తెలిపారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వలన శ్రీనివాసరావుకు మార్కెటింగ్ శాఖలో ఉన్నతమైన డైరెక్టర్ పోస్టు చేపట్టే అవకాశం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు చేసిన సా యాన్ని మాదిగలు ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటారని మంద కృష్ణ చెప్పారు.