Share News

పొదుపు లెక పక్కా

ABN , Publish Date - May 06 , 2026 | 12:18 AM

పొదుపు సంఘాలలో లెక్కలు ఇక పక్కాగా ఉం డనున్నాయి. ఎన్ని సంస్కరణలు చేపట్టిన సంఘాలలో అక్రమాలు, నిధులు పక్కదారి పట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

   పొదుపు లెక పక్కా
వీవోఏలకు స్మార్ట్‌ఫోనలు అందజేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

పుస్తకాల్లో రాతలకు ఇక పుల్‌స్టాప్‌

మన డబ్బులు- మన లెక్కలు పేరుతో కొత్త యాప్‌

పొదుపు సభ్యుల ఆర్థిక లావాదేవిలన్ని యాప్‌లోనే

చాగలమర్రి, మే 5(ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాలలో లెక్కలు ఇక పక్కాగా ఉం డనున్నాయి. ఎన్ని సంస్కరణలు చేపట్టిన సంఘాలలో అక్రమాలు, నిధులు పక్కదారి పట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ ద్వార నిధులు పక్కదారి పట్టకుండా, మోసాలకు తావు లేకుండా ఉండేందుకు నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నంద్యాల జిల్లాలో సుమారు 30,738 పొదుపు సంఘాలు ఉండగా 3.80 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.

అనేక రకాల రుణాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వార యేటా వేల కోట్లలో రుణాలు పొదుపు సంఘాల సభ్యులకు అందుతున్నాయి. బ్యాంకు లింకేజి, స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాల ద్వార రు ణాలు పొదుపు సంఘాలకు మంజూరు చేస్తున్నారు. సంఘాలలోని సభ్యుల నిరక్షరాస్యత, అవగాహన లేమిని ఆసరగా తీసుకొని డీఆర్‌డీఏ, వెలుగు విభాగంలో కొందరు అక్రమా లకు పాల్పడుతున్నారు. నిధులను స్వాహా చేస్తున్నారు. పొదుపు సంఘాల ఆర్థిక లావా దేవిలతో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం మన డబ్బులు- మన లెక్కలు అనే యాప్‌ను అందులోబాటులోకి తెచ్చింది.

గతంలో పొదుపు సంఘాలకు..

గతంలో పొదుపు సంఘాలకు విడుదలైన నిధుల జమా ఖర్చుల వివరాలన్నీ పుస్తకాలలో చేతి రాతతో నమోదు చేసేవారు. గత ఆర్థిక సంవత్సరం వరకు ఇదేవిధంగా జరిగింది. డీఆర్‌డీఏ వెలుగు ఉద్యోగులలో కొందరు బ్యాంకు అధికారులు పక్కదారి పట్టించిన పొదుపు సంఘాల వారికి తెలిసేది కాదు. సభ్యుల రుణాలు ఎన్ని వాయిదాలలో చెల్లించాలి, ఎంత చెల్లిస్తున్నారు, ఎప్పుడు రుణం తీసుకున్నారు వంటి వివరాలు స్పష్టంగా తెలిసేవి కావు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆధునిక సాంకేతితతో యాప్‌ను రూపొందించింది. వాస్తవానికి ఈ యాప్‌ను గత జూన నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. యాప్‌ వినియోగంపై సిబ్బంది శిక్షణ కూడా పూర్తి చేశారు. రుణాల మంజూరు మొదలుకొని రుణ వాయిదాల చెల్లింపుల వరకు అన్ని రకాల లావాదేవిలు మన డబ్బులు-మన లెక్కలు యాప్‌ ద్వారానే జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా విడుదలవుతున్న నిధుల వివరాలను ఈ నెల నుంచి యాప్‌లోనే నమోదు చేస్తున్నారు. పొదుపు సంఘంలోని ప్రతి సభ్యురాలి వ్యక్తిగత, ఆర్థికపరమైన సమాచారం నుంచి రుణాల వరకు అన్ని వివరాలను యాప్‌లో పొందుపురుస్తున్నారు.

తోటి సభ్యులకు తెలియకుండా..

రుణాల ఎగవేత కారణంగా సభ్యులు నష్టపోకుండా ఉండేందుకు యాప్‌ ఉపయోగపడుతుంది. తోటి సభ్యులకు తెలియకుండా వేరే వారు బ్యాంకుల నుంచి అప్పు పొందేందుకు వీలుండదు. ఖాతాలో వడ్డీ, పొదుపు నగదు ఎంత ఉంది, బకాయిల వివరాలు ఎప్పటికప్పుడు సభ్యులు తెలుసుకోవచ్చు.

Updated Date - May 06 , 2026 | 12:18 AM