Share News

సౌదీలో ఉద్యోగాలకు నేడు ఇంటర్వ్యూలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:44 AM

సౌదీ అరేబియాలో ఉద్యోగాల కల్పనకు బుధవారం విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంప్‌సలో ఇంటర్వ్యూలు..

సౌదీలో ఉద్యోగాలకు నేడు ఇంటర్వ్యూలు

అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలో ఉద్యోగాల కల్పనకు బుధవారం విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంప్‌సలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ డి.మనోహర్‌ తెలిపారు. సౌదీలో కేబుల్‌ స్ప్లైసర్‌, కేబుల్‌ జాయింటర్‌, టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌ టెక్నీషియన్‌, మెకానికల్‌ టెక్నీషియన్‌, ప్లంబర్‌, స్కాఫోల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 22 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులని, జీతం నెలకు రూ.28,800 నుంచి రూ.72 వేల వరకు ఉంటుందని వివరించారు. అభ్యర్థులు తాజా బయోడేటా, విద్యార్హత, ఉద్యోగానుభవం సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 04:45 AM