స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:17 AM
సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారత ద్వారా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారత ద్వారా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ‘సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర సమగ్ర ప్రగతి దిశగా రూపొందించిన నూతన జనాభా స్థీరికరణ విధానంలో భాగంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించింది. గర్భధారణ, శిశు సంరక్షణను మహిళా హక్కుగా గుర్తించిన ప్రభుత్వం వారి జీవన గమనంలో అన్ని దశల్లో అండగా ఉంటుంది. వారికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మహిళల జీవనంలోని అన్ని దశల్లోనూ నాణ్యమైన సేవల్ని అందుబాటులో ఉంచి వారికి సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడం, సంతాన ప్రాప్తి హక్కును సరైన విధానంలో సాకారం చేయడం, ఆర్థిక స్వావలంబన ఆటంకాలను తొలగించడం, శిశు సంరక్షణలో పురుషుల్ని భాగస్వాములు చేయడం వంటివి ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం’ అని మంత్రి తెలిపారు.