జగన్ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:37 AM
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ నాటి పాలకులు ఆడిన వికృత రాక్షస క్రీడలతో అభివృద్ధి అటకెక్కిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ నాటి పాలకులు ఆడిన వికృత రాక్షస క్రీడలతో అభివృద్ధి అటకెక్కిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేదీ’ సినిమాలో బ్రహ్మానందం ఓ చెట్టు కింద నిల్చొని అబద్ధాలు చెబుతుంటే.. ఆ చెట్టు ఆకులు నేల రాలతాయి. అలాగే.. జగన్‌ను నల్లమల అడవులకు తీసుకువెళ్లి ఆ చెట్ల కింద మూడు నిమిషాలు మాట్లాడిస్తే.. ఆయన చెప్పే అబద్ధాలకు అడవిలోని చెట్ల ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుబారిపోతాయి. అలా పది నిమిషాలు జగన్ మాట్లాడితే నల్లమల అడవి భష్మీపటం అయ్యే అవకాశం ఉంది’ అని సెటైర్లు వేశారు.