ఘనంగా సత్య ఏజెన్సీస్ ప్రథమ వార్షికోత్సవం
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:08 AM
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న సత్యా ఏజెన్సీస్ ప్రథమ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది.
విజయవాడ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న సత్యా ఏజెన్సీస్ ప్రథమ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సత్యా మేనేజింగ్ డైరెక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. సంవత్సరకాలంగా గొల్లపూడి ప్రాంత ప్రజలు సత్యా ఏజెన్సీ పై చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సె్‌సను సరసమైన ధరలకు అందిస్తూ మెరుగైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. భవిష్యత్తులో కూడా ‘స్ర్పెడింగ్ హ్యాపినెస్’ నినాదంతో వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తూ, మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.