Student Missing: అమెరికాలో సంతమాగులూరు యువకుడి అదృశ్యం
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:25 AM
ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన కారసాని హరీశ్ రెడ్డి అమెరికాలో అదృశ్యమయ్యారు. బంధువుల కథనం మేరకు..
సంతమాగులూరు(అద్దంకి), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన కారసాని హరీశ్ రెడ్డి అమెరికాలో అదృశ్యమయ్యారు. బంధువుల కథనం మేరకు.. హరీశ్ రెడ్డి మూడేళ్ల క్రితం అమెరి కాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. అక్కడే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నా రు. సంతమాగులూరుకే చెందిన మరో ముగ్గురు యువకులతో కలసి టెక్సాస్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్కాస్‌లోని డెనాలి ప్రాంతానికి ఒక్కడే విహారయాత్రకు వెళ్లాడు. డిసెంబరు 30నుంచితల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేయ లేదు. ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయ తెలిసి సంతమాగులూరులో ఉంటున్న తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. హరీశ్‌రెడ్డి ఆచూకీ కోసం అక్కడ ఉన్న తెలుగు వారు ప్రయత్నిస్తున్నారు.