Share News

25 నుంచి సంస్కృత సప్తాహం

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:10 AM

సంస్కృత భాషకు ప్రచారాన్ని కల్పించడంతోపాటు మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఢిల్లీ) సహకారంతో ఈ నెల 25 నుంచి..

25 నుంచి సంస్కృత సప్తాహం

  • తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌

విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సంస్కృత భాషకు ప్రచారాన్ని కల్పించడంతోపాటు మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఢిల్లీ) సహకారంతో ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత సప్తాహం నిర్వహించనున్నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ ఆర్డీ విల్సన్‌ (శరత్‌చంద్ర) వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తెలుగు అకాడమీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంస్కృత సప్తాహం ఈ నెల 25న శ్రీకాకుళంలో ప్రారంభమవుతుందన్నారు. 26న విశాఖపట్నం, కొవ్వూరు, 27న తణుకు, గుంటూరు, 28న జిల్లెళ్లమూడి, 30న కర్నూలు, 31న గుడివాడలో అదేరోజు విజయవాడలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 04:12 AM