Srisailam: శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:00 AM
శ్రీశైలంలో ఈనెల 11న ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి.
శ్రీశైలం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో ఈనెల 11న ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లు చివరి రోజు అశ్వవాహనంపై విహరించారు. అలాగే శ్రీగిరిలో పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహించారు. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.