Share News

Sankranti Bonanza: ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:14 AM

ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం రూ.2,653 కోట్ల రూపాయలను చెల్లించింది.

Sankranti Bonanza: ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక

  • డీఏ, డీఆర్‌ బకాయిలు 1,100 కోట్లు విడుదల

  • కాంట్రాక్టు పనులకు రూ.1,243 కోట్లు చెల్లింపు

అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం రూ.2,653 కోట్ల రూపాయలను చెల్లించింది. దీనిలో ఉద్యోగులకు పెండింగులో ఉన్న కరువు భత్యా(డీఏ)ల్లో ఒక డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌ రూ.1,100 కోట్లను విడుదల చేసింది. అదేవిధంగా పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్‌ లీవుల్లో రూ.110 కోట్లు మంజూరు చేసింది. ఇక.. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్‌ఐఎఫ్‌ పనులు చేసిన 19 వేలమంది కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్లు చెల్లించింది. డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌ చెల్లింపులతో 2.25 లక్షల సీపీఎస్‌ ఉద్యోగులకు, 2.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలిగింది. సరెండర్‌ లీవుల సొమ్ము చెల్లింపుతో సుమారు 55 వేల మంది పోలీసులకు లబ్ధి చేకూరింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం ఒక ప్రకటనలో వివరించారు.

Updated Date - Jan 13 , 2026 | 05:14 AM