Share News

సినీ, వినోద రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:21 AM

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సంజయ్‌దత్‌...

సినీ, వినోద రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

  • సంజయ్‌దత్‌ను ఆహ్వానించిన సీఎం

  • సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన బాలీవుడ్‌ నటుడు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సంజయ్‌దత్‌ సుమారు అరగంటపాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమారంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్‌దత్‌ సీఎంకు తెలిపారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా ఉన్న ప్రణాళికలను ఆయనకు సీఎం వివరించారు. సినిమా, వినోద రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Updated Date - Mar 25 , 2026 | 04:21 AM