Share News

నేటి నుంచి సంగం పాల ధర పెంపు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:54 AM

సంగం డెయిరీ పాల అమ్మకపు ధరలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి. గోపాలకృష్ణన్‌ మంగళవారం తెలిపారు.

నేటి నుంచి సంగం పాల ధర పెంపు

పొన్నూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ పాల అమ్మకపు ధరలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి. గోపాలకృష్ణన్‌ మంగళవారం తెలిపారు. సంగం గోల్డ్‌ ప్లస్‌ 500 మిల్లీలీటర్లు రూ.37 ధర ఉండగా రూపాయి పెంచి రూ. 38కి విక్రయించనున్నట్టు చెప్పారు. అలాగే హెచ్‌ఎఫ్‌సీఎం గోల్డ్‌ ప్యాకెట్‌ ధర రూ.36 నుంచి రూ.37కు, లీటరు రూ.70 నుంచి రూ.72కు పెంచినట్టు తెలిపారు. పీఎ్‌ఫసీఎం గోల్డ్‌ 500 మిల్లీ లీటర్లు రూ. 36 నుంచి రూ. 37కు, టీ స్పెషల్‌ 500 మిల్లీ లీటర్లు రూ.35 నుంచి రూ. 36కు పెంచినట్టు తెలిపారు. ఎస్‌టీఎం మిల్క్‌ అర లీటరు రూ.32 నుంచి రూ. 33కు, టీఎం మిల్క్‌ లీటరు రూ.56 నుంచి రూ. 58కి, డీటీఎం మిల్క్‌ 500 మిల్లీ లీటర్లు రూ. 27 నుంచి రూ. 28కి పెంచినట్టు ఎండీ వివరించారు.

Updated Date - Apr 01 , 2026 | 04:55 AM