Share News

రేపటి నుంచి సంగం పాల సేకరణ ధర పెంపు

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:01 AM

సంగం డెయిరీ పాల సేకరణ ధరను ఈ నెల 21వ తేదీ నుంచి పెంచుతున్నట్టు ఎండీ పి.గోపాల్‌కృష్ణన్‌ గురువారం తెలిపారు.

రేపటి నుంచి సంగం పాల సేకరణ ధర పెంపు

పొన్నూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ పాల సేకరణ ధరను ఈ నెల 21వ తేదీ నుంచి పెంచుతున్నట్టు ఎండీ పి.గోపాల్‌కృష్ణన్‌ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లాలో గేదె పాలకు రూ.840 కిలో వెన్నకు, ఆవుపాలకు రూ.310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గేదె పాలకు రూ.830, ఆవుపాలకు రూ.301.. నెల్లూరు జిల్లాలో గేదె పాలకు రూ.820, ఆవుపాలకు రూ.301.. ప్రకాశం జిల్లాలో కేంద్రాలు, డెయిరీ ఫారాల వారికి గేదె పాలకు రూ.840, వెండార్‌ పాయింట్లకు రూ.820, ఆవుపాలకు రూ.310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 05:01 AM