Share News

కూటమి నేతల అండదండలతో ఇసుక దోపిడీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:27 AM

కూటమి నేతల అండ దండలతో మార్లమడికి నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నా రని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు.

 కూటమి నేతల అండదండలతో ఇసుక దోపిడీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

అధికారులు ఏం చేస్తున్నట్లు...

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కూటమి నేతల అండ దండలతో మార్లమడికి నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నా రని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. బుధవారం హొళ గుంద మండలంలోని మార్లమడికి నదిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నా ఇక్కడ మాత్రం ఎస్‌ఐ అండతో ఇసుకను తరలిస్తున్నారన్నారు. నది నుంచి ఇసుక దోపిడీ జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇసుక సొమ్ములో అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులకు వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాగే గూళ్యంలో కూడా ప్రకాష్‌ అనే టీడీపీ నాయకుడు ట్రాక్టర్‌లకు టీడీపీ జెండాలు పెట్టుకుని ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు శేషప్ప, షఫీఉల్లా పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:27 AM