Share News

ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా సంసాని

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:58 AM

రాష్ట్ర ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సంసాని శ్రీనివాసరావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా సంసాని

విజయవాడ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సంసాని శ్రీనివాసరావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఈ ఎన్నికలు జరిగాయి. ఏపీ కో-ఆపరేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణి పేర్రాజు ఎన్నికల అధికారిగా, నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.మల్లేశ్వరరావు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నిర్వహించిన సభలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఐక్యంగా ఉండి ఏకగ్రీవంగా నాయకత్వాన్ని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 03:59 AM