Share News

రాఘవేంద్ర నమో నమః

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:17 PM

శ్రీగురు రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు.

   రాఘవేంద్ర నమో నమః
రజిత గజవాహనంపై ప్రహ్లాదరాయలు

రజిత గజవాహనంపై ప్రహ్లాదరాయలు

ఊంజల మండపంలో శాఖోత్సవం చేసిన పీఠాధిపతి

మూలరాములకు కనకాభిషేకం

కన్నులపండువగా తెప్పోత్సవం

మంత్రాలయం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీగురు రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు. రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. మూలరాములకు కనకాభిషేకం చేసిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజిత గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊంజల సేవలో ఊగిస్తూ పీఠాధిపతి శాఖోత్సవం చేసి మహమంగళహారతులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మఠం ప్రాంగణం కిక్కిరిసింది. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టు వస్త్రాలు, గులాబి ప్రత్యేక పుష్పాలతో శోభాయానుమానంగా అలంకరించారు. పరిమళ పుష్కరిణిలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు తెప్పోత్సవంలో విహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విధ్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, సుజయీంద్రాచార్‌, గౌతమాచార్‌, ఆనంద తీర్థాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, శ్రీమఠం నార్త్‌ ఇండియా విచారణకర్త శ్రీనివాస కస్బే, కర్నాటక పీఆర్‌వో సంజీవ్‌ కులకర్ణి, రాజా పీ అప్రమేయాచార్‌, కృష్ణ కౌసిక్‌, శ్రీపతిఆచార్‌, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌, రాఘవేంద్రావు, రవి కులకర్ణి, సీఆర్‌వోలు విజయేంద్రాచార్‌, బద్రినాథ్‌, జయతీర్థాచార్‌, ఏఈ బద్రినాథ్‌, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్‌ ఆచార్‌, డీఎం ఆనందరావు, సెక్యూరిటీ ఇనచార్జి రమేష్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యరూపకం: ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి యోగీంద్ర కళా మండపంలో బెంగుళూరుకు చెందిన ప్రభాత ఆర్ట్స్‌ ఇంటర్‌నేషనల్‌ బృందం వారిచే ‘రాయరిద్దారే’ నాటక ప్రదర్శన భక్తులను అలరించింది. అదే విధంగా విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ శారద సుబ్రమణ్యనచే వాయిలీన వాయిద్యం, బెంగుళూరుకు చెందిన విద్వానలు రవీంద్ర, నిరంజన వారిచే దాసవాణి సాహిత్యం అలరించింది. కళాకారులకు పీఠాధిపతి శేషవస్త్రం, జ్ఞాపిక, నగదు, ఫల, ఫుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి సత్కరించి ఆశీర్వదించారు.

నేడు పూర్వారాధన

రాఘవేంద్రస్వామి ఉత్సవాల్లో శనివారం రాఘవేంద్రస్వామి పూర్వారాధన జరగనుంది. మూడో రోజున జరిగే పూజా కార్యక్రమాలు ఇవే..

ఫ తెల్లవారుజామున బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం

ఫ 5 నుంచి 6 గంటల వరకు క్షీరాభిషేకం

ఫ 6 నుంచి 8:30 గంటల వరకు ప్రహ్లాదరాయలకు పాదపూజ

ఫ 8:30 నుంచి 11 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం

ఫ 11 నుంచి 12:30 గంటల వరకు పీఠాధిపతుల సంస్థాన పూజ

ఫ మధ్యాహ్నం 1:30 గంటలకు మహామంగళహారతి

ఫ సాయంత్రం 5 గంటలకు జ్ఞాన యజ్ఞం

ఫ రాత్రి 8:30 గంటలకు సింహ వాహన సేవ

Updated Date - Aug 28 , 2026 | 11:17 PM