Share News

చంద్రబాబు భయపడుతున్నాడు

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:22 AM

తమ నేత జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నాడని, కూటమి నేతలు వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని...

చంద్రబాబు భయపడుతున్నాడు

  • షర్మిలను రాజకీయంగా వాడుకుంటున్నాడు: సజ్జల

అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తమ నేత జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నాడని, కూటమి నేతలు వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ అనుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతిలో భవిష్యత్‌లో పేదవాడు ఉండగలడా అని అడిగారు. మౌలిక సదుపాయాలు లేని అమరావతికి హైదరాబాద్‌ నుంచి ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కవాయిద్యాలలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా ఒకరని వ్యాఖ్యానించారు. ఆయనకు అవసరం వచ్చినప్పుడల్లా షర్మిల సిద్ధంగా ఉంటారని.. తెరపైకి వచ్చి జగన్‌ను తిట్టేసి పోతుంటారని ధ్వజమెత్తారు. మావిగన్‌పై ఇంకా ఆమె మాట్లాడలేదేమిటని అనుకుంటుండగానే.. జగన్‌ను జోకర్‌గా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారని తెలిపారు. రాజకీయావసరాల కోసం తనను చంద్రబాబు వాడుకుంటున్నాడని ఆమె గ్రహించలేకపోతున్నారని అన్నారు. రాజధానిగా అమరావతి కంటే.. ఇప్పటికీ వైజాగే బెస్ట్‌ అని చెప్పారు. దేశంలోని నంబర్‌ టూ నగరాల్లో విశాఖ నగరం ఉందని.. అక్కడే స్టీల్‌ ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, ఓడరేవు, విమానాశ్రయం వంటివి ఉన్నందున పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అత్యుత్తమమని అన్నారు. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని.. 2029 వరకూ అమరావతే రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన తేవడంతో అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో ఇది కూడా ఉందని ముఖ్యమంత్రి అంటున్నాడని అన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:22 AM