మేం గెలిచాక ఎవర్నీ వదలం!
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:35 AM
ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. మేం అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలి పెట్టం. ఎక్కడున్నా తీసుకొస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ ప్రభుత్వ మాజీ సలహాదారు...
అధికారులందరిపై ప్రైవేటు కేసులు వేస్తాం: సజ్జల బెదిరింపు
గుంటూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. మేం అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలి పెట్టం. ఎక్కడున్నా తీసుకొస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అంటూ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులకు దిగారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆదివారం అంబటి నివాసాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు పథకం ప్రకారమే అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయిస్తున్నా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. డీజీపీకి, ఐజీకి తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పక్షపాతంగా వ్యవహరించిన అధికారులందరిపైనా ప్రైవేటు కేసులు వేస్తామని సజ్జల హెచ్చరించారు.