సజ్జలకు ‘మావిగన్’ సెగ!
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:20 AM
జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ సెగ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగానే తగిలింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో...
రాష్ట్రవ్యాప్తంగా అనుకూల ప్రచారం చేయండి
గుంటూరు-కృష్ణా వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం
ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ముఖ్య నేతలు
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ సెగ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగానే తగిలింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే జగన్ తన సానుకూల మీడియా సమక్షంలో ప్లాన్-బీగా మావిగన్‌ను అమలు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో జగన్‌పై విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తాయి. జగన్.. మావిగన్ ప్రతిపాదన తీసుకురావడంపై ఆయన సొంత పార్టీలోనే నిరసన వెల్లువెత్తుతోంది. ఇదేమీ పట్టని జగన్ మాత్రం మావిగన్ ప్రతిపాదనను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ సీనియర్ నేతలను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సజ్జల శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల ముఖ్యనేతలు, సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మావిగన్‌పై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. చంద్రబాబు అవినీతి కోసమే అమరావతిని శాశ్వత రాజధాని అంటున్నారని విమర్శించారు. దీంతో సజ్జలపై కొందరు ముఖ్యనేతలు, కొన్ని అ సెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం మూడు రాజధానులు అన్నామని.. ఇప్పుడు మావిగన్ అంటున్నామని అసహనం వ్యక్తం చే శారు. నేతల ఆగ్రహంతో కంగుతిన్న సజ్జల.. వెంటనే మాట మార్చేశారు. తిరుమల పవిత్రత రోజురోజుకూ దెబ్బతింటోందని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తం గా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేయాలని, ఇదే డిమాండ్‌తో ఆందోళనలు చేయాలని సమన్వయకర్తలను సజ్జల ఆదేశించారు.