Share News

ప్రజామోదం లేని వ్యక్తి సజ్జల: ఎమ్మెల్సీ నాయుడు

ABN , Publish Date - Jan 11 , 2026 | 04:08 AM

సజ్జల రామకృష్ణా రెడ్డి.. వైసీపీలో హోదా లేని, ప్రజల్లో ఆమోదం లేని వ్యక్తి. కనీసం వార్డు మెంబర్‌ కూడా కానీ వ్యక్తి కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శించడం సిగ్గుచేటు...

ప్రజామోదం లేని వ్యక్తి సజ్జల: ఎమ్మెల్సీ నాయుడు

ఇంటర్నెట్ డెస్క్: ‘సజ్జల రామకృష్ణా రెడ్డి.. వైసీపీలో హోదా లేని, ప్రజల్లో ఆమోదం లేని వ్యక్తి. కనీసం వార్డు మెంబర్‌ కూడా కానీ వ్యక్తి కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శించడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సజ్జల ఏ హోదాలో రాజధానిపైన, సాగునీటి ప్రాజెక్టులపైన విమర్శలు చేస్తున్నారో చెప్పాలి. సజ్జల ఇచ్చిన సూచనల ఫలితంగానే వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సీమ సాగు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పట్టించుకున్నదే లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 11 , 2026 | 04:09 AM