Share News

‘ఇండియానా’ అటార్నీగా సాయి శ్రీనివాస్‌ రెడ్డి

ABN , Publish Date - May 14 , 2026 | 04:56 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కుమారుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్‌ రెడ్డి అరుదైన ఘనత సాధించారు.

‘ఇండియానా’ అటార్నీగా సాయి శ్రీనివాస్‌ రెడ్డి

  • టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి తనయుడి ఘనత

పులివెందుల, మే 13(ఆంధ్రజ్యోతి): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కుమారుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్‌ రెడ్డి అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో లైసెన్స్‌డ్‌ అటార్నీగా ప్రమాణస్వీకారం చేశారు. 25 ఏళ్ల వయసులో తొలి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించి తెలుగు జాతి కీర్తిని అమెరికాలో చాటిచెప్పారు. సాయి శ్రీనివాస్‌ టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలియన్స్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అమెరికాలో మాస్టర్‌ ఆఫ్‌ లా పూర్తిచేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో సమ్మర్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. ఇటీవల ఇండియానా బార్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఆయన భారత్‌, అమెరికా దేశాల్లో ఏకకాలంలో లీగల్‌ ప్రాక్టీస్‌ చేయడానికి అర్హత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. కాగా.. సాయి శ్రీనివాస్‌ రెడ్డికి మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - May 14 , 2026 | 04:56 AM