Share News

సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై సిట్‌ను స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:25 AM

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు ...

సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై సిట్‌ను స్వాగతిస్తున్నాం

  • క్రాంతికుమార్‌ కేసునూ సిట్‌ పరిధిలో చేర్చాలి

  • సీఐ నాగరాజు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దారుణం: మంద కృష్ణ మాదిగ

విజయవాడ(కృష్ణలంక)/తాడేపల్లి, జూలై1 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ పరిధిలోకి పేరుపోగు క్రాంతికుమార్‌ కేసును కూడా చేర్చాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో బుధవారం ఆయన సాయికృష్ణ కుటుంబసభ్యులను, ఫకీరుగూడెంలోని క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంద కృష్ణ.. సాయికృష్ణ, క్రాంతికుమార్‌పై కేసులుంటే చట్టపరంగా శిక్షించాల్సి ఉందని, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని శిక్షించడం అన్యాయమన్నారు. సీఐ నాగరాజు రౌడీలా వ్యవహరించడమే కాకుండా, అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:25 AM