Share News

సాయికృష్ణ కేసులో... సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:13 AM

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు విచారణపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

సాయికృష్ణ కేసులో... సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు విచారణపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సాయికృష్ణ మృతి కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్‌ కస్టడీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన కఠిన నిబంధనలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిందితుడి ట్రాన్సి ట్‌ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్‌ చేయాలన్న షరతులను సిట్‌ వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్‌ వచ్చే బుధ, గురువారాల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jul 12 , 2026 | 05:14 AM