కూటమి కోసం త్యాగాలు చేయాలి..: నాగబాబు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:46 AM
కూటమిలో సర్దుబాటు కోసం కొంత మంది త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కె.నాగబాబు తెలిపారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమిలో సర్దుబాటు కోసం కొంత మంది త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కె.నాగబాబు తెలిపారు. సోమవారం ఉదయం ఎన్‌ఆర్‌ఐ శ్రేణులతో ఆయన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. త్యాగాలు చేసిన దానికి తానూ ఒక ఉదాహరణ అన్నారు. ఇదే సమయం లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయారని చెప్పారు.