ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల నిరవధిక ఆందోళన
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:25 AM
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు నిరవధిక ఆందోళన బాట పట్టారు.
విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు నిరవధిక ఆందోళన బాట పట్టారు. సోమవారం గొల్లపూడిలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కార్యాలయం పక్కనే టెంటు వేసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాత్రింబవళ్లూ ఇక్కడే ఉంటూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం వంటా వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. నెల క్రితం తాము ఆందోళన చేయగా, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును పెద్ద కాంట్రాక్టరకు పందేరం చేస్తున్నారని విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.