Share News

‘ఆర్‌యూఎస్‌యూవో’ రాష్ట్ర కమిటీ ఎన్నిక

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:39 AM

రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌యూఎస్‌యూవో) కొత్తగా ఏర్పాటైంది. 30 టీచర్‌ సంఘాలు శుక్రవారం విజయవాడలో ...

‘ఆర్‌యూఎస్‌యూవో’ రాష్ట్ర కమిటీ ఎన్నిక

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌యూఎస్‌యూవో) కొత్తగా ఏర్పాటైంది. 30 టీచర్‌ సంఘాలు శుక్రవారం విజయవాడలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కమిటీ ఎన్నిక కూడా జరిగింది. చైర్మన్‌గా ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.శ్రీనివాసరావు, కోశాధికారిగా ఎం.మీరయ్య, సహ చైర్మన్లుగా ఎస్‌.రాజేశ్వరి, ఆర్‌.సుధాకర్‌రెడ్డి, అన్నం శ్రీనివాస్‌, ఖాజా రహమతుల్లా, ఎం.అమర్నాథ్‌, కె.పూర్ణచంద్ర నాయక్‌, శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఉప ప్రధాన కార్యదర్శులుగా డి.పెంచలయ్య, గణేష్‌, లక్ష్మణ్‌, పారయ్య, సుధీర్‌, వెంకటసుబ్బయ్య... మహిళా కార్యదర్శులుగా గంగాభవానీ, మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Updated Date - Apr 04 , 2026 | 03:41 AM