Share News

టీచర్లకు పదోన్నతులు కల్పించాలి: రూసో

ABN , Publish Date - May 04 , 2026 | 04:48 AM

ఉపాధ్యాయులకు అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త సంస్థ(రూసో) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రూసో చైర్మన్‌ సీవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో...

టీచర్లకు పదోన్నతులు కల్పించాలి: రూసో

అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త సంస్థ(రూసో) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రూసో చైర్మన్‌ సీవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రస్థాయి వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. టీచర్ల సమస్యలపై విడతల వారీగా వేసవిలో నిరసనలు చేపట్టాలని తీర్మానించారు. హైస్కూల్‌ ప్లస్‌లలో ఉన్న ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని కోరారు. 33 డిమాండ్ల సాధన కోసం ఈనెల 11న కడప కలెక్టరేట్‌ వద్ద, 25న విశాఖపట్నం కలెక్టరేట్‌ వద్ద, జూన్‌ 8న గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - May 04 , 2026 | 04:50 AM