Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:44 PM

పల్లె పండుగ 3.0లో భాగం గా జిల్లాలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

రూ.67.50 కోట్లతో రహదారుల నిర్మాణం

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ 3.0లో భాగం గా జిల్లాలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని 27 మండలాల్లో నూతన రహదారుల నిర్మాణానికి పల్లె పండుగలో ప్రణాళికలు రూపొందించారు. ప్రతి మండలానికి రూ.2.50 కోట్లు చొప్పున నిధులు మంజూరు కానున్నాయి. మొత్తం రూ.67.50 కోట్ల వ్యయంతో జిల్లావ్యాప్తంగా 135కి.మీల సీసీ, 5కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించనున్నారు. అవశ్యకత ఉన్న పనులను ఇప్పటికే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించగా, వాటికి ఆమోదం లభించింది. అక్టోబ రు 5వరకు పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌ అధి కారులు భూమి పూజ నిర్వహించి, పనులను అధికారికంగా ప్రారంభిస్తున్నారు. మొత్తం నా లుగు విభాగాలుగా రోడ్లు పనులను చేపడుతున్నారు. వీటిలో సీసీ, బీటీతో పాటు మట్టి రహదారులు, గతంలో నిర్మాణ పనులు మొదలుపెట్టి అర్థాంతరంగా నిలిపివేసిన పనులను సైతం పల్లె పండుగలో పూర్తి చేయనుండటం గమనార్హం.

Updated Date - Sep 30 , 2026 | 11:44 PM