గవర్నర్‌తో ఆర్‌టీఐ కమిషనర్ల భేటీ
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:35 AM
గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో రాష్ట్ర సమాచార కమిషనర్లు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో రాష్ట్ర సమాచార కమిషనర్లు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలో కమిషనర్లు రేహానా బేగం, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్ కల్యాణ చక్రవర్తి, ఉదయ్ భాస్కరరెడ్డి, చావలి సునీల్.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.సమాచార కమిషన్‌లో సిబ్బంది కొరత ఉందని ఆయన దృష్టికి వారు తీసుకెళ్లారు.