ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:59 PM
కుంటనహాల్ గ్రామం నుంచి ఆదోని పట్టణానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు.
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి) : కుంటనహాల్ గ్రామం నుంచి ఆదోని పట్టణానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటనహాళ్ గ్రామం నుంచి కుంటన హాల్, బధినేహాల్, జీ హాసల్లి, కడితోట గ్రామాలనుంచి సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆదోనిలోని పాఠశాలలకు, కళాశాలలకు చదువుకునేందుకు వస్తున్నారన్నారు. విద్యార్ధుల కోసం ప్రత్యేక బస్సు లేకపోవడంతో సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. గంటపాటు రోడ్డుపై బైఠా యించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండవ పట్టణ పోలీసులు జోక్యం చేసుకొని డిపో మేనేజర్ తో మాట్లాడి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షుడు రవిచంద్ర, అలీబాషా, నాయకులు మహేష్, రాజు, ఈరన్న, శశిధర్ పాల్గొన్నారు.