Share News

వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:53 PM

శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

   వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ప్రమాదానికి గురవ్వడంతో ధ్వంసమైన ఆర్టీసీ బస్సు

బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం

పది మంది ప్రయాణికులకు గాయాలు

శిరివెళ్ల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి) : శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామం నుంచి నంద్యాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు శిరివెళ్ల మెట్ట వద్ద మలుపు తీసుకునే సమయంలో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఎదురుగా ఉన్న జాతీయ రహదారి అండర్‌పాస్‌ బ్రిడ్జిని ఢీకొట్టింది. బస్సు అద్దాలు ధ్వంసం కావడంతోపాటు పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 10:53 PM