Share News

ఉచిత బస్సుకు 880 కోట్లు: రాంప్రసాద్‌రెడ్డి

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:11 AM

స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీకి రూ.880కోట్లు విడుదల చేసినట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఉచిత బస్సుకు 880 కోట్లు: రాంప్రసాద్‌రెడ్డి

ఇంటర్నెట్ డెస్క్: స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీకి రూ.880కోట్లు విడుదల చేసినట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ‘గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 3,400 రూట్లలో 7,896 బస్సుల్లో 44.79కోట్ల మంది మహిళలు ఉచిత బస్సును వినియోగించుకున్నారు. ఈ పథకానికి నెలకు రూ.160 కోట్లు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది’ అని తెలిపారు. ఇక, రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ రంగాల్లో 5,72,28 ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని అమలు చేయలేదని స్పష్టం చేశారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ను 1,150 ఎకరాల్లో అభివృద్ధి చేశామని మంత్రి టీజీ భరత్‌ చెప్పారు.

Updated Date - Mar 06 , 2026 | 04:13 AM