Share News

వ్యవసాయ పరికరాలకు రూ.8.63 కోట్లు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:43 PM

నంద్యాల జిల్లాలో 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యంత్ర పరికరాలకుగాను జిల్లాకు రూ.8.63 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

వ్యవసాయ పరికరాలకు రూ.8.63 కోట్లు

డీఏవో వెంకటేశ్వర్లు

నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యంత్ర పరికరాలకుగాను జిల్లాకు రూ.8.63 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శనివారం వ్యవసాయ యంత్రాల డీలర్లు, తయారీదారులతో డీఏవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ పథకం అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, రైతులకు నిర్ణీత కాలపరిమితిలోనే యంత్రాలను అందజేయాలని డీలర్లను హెచ్చరించారు. జిల్లాలోని సాగు విస్తీర్ణం, మండలాలకు ఈ పంట నమోదు ఆధారంగా చేసుకుని నిధులు కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీతోను, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీతోను వ్యవసాయ పనిముట్లు అందజేస్తామన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:43 PM