Share News

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.600 కోట్లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:38 AM

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.600 కోట్లు

  • జూన్‌ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీరు: నిమ్మల

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ మొత్తంలో రూ.500 కోట్లు పనులకు, రూ.100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు చెప్పారు. సుజల స్రవంతితోపాటు, ఉత్తరాంధ్రలో ప్రాధాన్య క్రమంలో మరో 11 ప్రాజెక్టులు గుర్తించి వాటికి రూ.460 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకాన్ని ఫేజ్‌-1లో రూ.2,022 కోట్లు, ఫేజ్‌-2లో రూ.4,210 కోట్లతో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 05:38 AM