ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలు జమ
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:17 AM
మైనార్టీల సంక్షేమంలో భాగంగా ఇమామ్‌లు, మౌజన్ల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.45 కోట్ల గౌరవ వేతనాలు 20 గంటల్లోనే జమ అయినట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమంలో భాగంగా ఇమామ్‌లు, మౌజన్ల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.45 కోట్ల గౌరవ వేతనాలు 20 గంటల్లోనే జమ అయినట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. రంజాన్ పర్వదినానికి రెండు రోజుల ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10వేల మంది ఇమామ్‌లు, మౌజన్లకు ఒకేసారి 6 నెలల గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొంటూ, రాష్ట్రంలోని మైనార్టీల తరఫున సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.