Minister BC Janardhan Reddy: ఏడాదిలో 3,380 కోట్లతో రహదారుల నిర్మాణం
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:56 AM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే సంవత్సరం రూ.3,380కోట్ల వ్యయంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణం...
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మచిలీపట్నం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే సంవత్సరం రూ.3,380కోట్ల వ్యయంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో మరో మంత్రి కొల్లు రవీంద్ర, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి ఆయన... బందరు ఓడరేపు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, రహదారులు భవనాల శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అఽధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,081కోట్ల వ్యయంతో 16 వేల కి.మీ మేరకు రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తిచేశాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకే సంవత్సరం రూ.3,380 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇందుకోసం టెండర్లు పిలిచాం. కొన్ని పనులు మొదలయ్యాయి. నాణ్యతలో ఏమాత్రం లోటులేకుండా వచ్చే మే నెల ఆఖరిలోగా పూర్తిచేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.