Share News

అటెండర్‌ ఖాతాలో 2.65 కోట్లు..!

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:41 AM

శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.

అటెండర్‌ ఖాతాలో 2.65 కోట్లు..!

  • చెన్నై ఎస్‌బీఐ ఖాతాదారు నుంచి పొరపాటున జమ

  • 16 లక్షల వరకూ డ్రా.. తర్వాత ఆ సొమ్మంతా జమ

కదిరి అర్బన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. చెన్నైలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారుడి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా నుంచి కదిరి ఎస్‌బీఐలోని మసూద్‌ ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయింది. దీంతో చెన్నైలోని ఆ ఖాతాదారు అక్కడి పోలీసులను ఆశ్రయించారు. చెన్నై పోలీసులు సమాచారం ఇవ్వడంతో కదిరి పోలీసులు గురువారం ఇక్కడి బ్యాంకుకు వెళ్లి విషయం తెలియజేశారు. బ్యాంకు అధికారులు మసూద్‌ ఖాతాను పరిశీలించగా.. రూ.16 లక్షల వరకూ డ్రా చేసినట్లు తేలింది. దీంతో మిగిలిన సొమ్మును పోలీసులు హోల్డ్‌లో పెట్టించారు. మసూద్‌ కోసం పోలీసులు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. గాండ్లపెంట ఎంపీడీవో రామకృష్ణను ఆరా తీయగా.. మూడు రోజుల నుంచి సెలవులో ఉన్నాడని తెలిపారు. దీంతో పోలీసులు ఆయన బంధువులను పిలిపించి విచారించారు. డ్రా చేసిన సొము ్మను తాము జమ చేస్తామని వారు పోలీసులకు, బ్యాంకు అధికారులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత మసూద్‌ బ్యాంకుకి వెళ్లి తాను డ్రా చేసిన సొమ్మును తిరిగి జమ చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, డబ్బు డ్రా చేసి పొరపాటు చేశానని, దాన్ని తిరిగి జమ చేశానని మసూద్‌ గురువారం రాత్రి వివరణ ఇచ్చాడు.

Updated Date - Feb 13 , 2026 | 03:41 AM